Konakanamitla: కోనకనమిట్లలో నామినేషన్ల రగడ: పోలీసుల లాఠీచార్జ్!
Konakanamitla: మార్కాపురం జిల్లా కోనకనమిట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల వేళ తోపులాట, ఉద్రిక్తత నెలకొంది.
Konakanamitla: కోనకనమిట్లలో నామినేషన్ల రగడ: పోలీసుల లాఠీచార్జ్!
కోనకనమిట్ల: మార్కాపురం జిల్లా కోనకనమిట్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గరిమినపెంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది.
నామినేషన్ పత్రాలను చించివేశారంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో పోలీసులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత కొనసాగడంతో అధికారులు ఎంపీడీవో కార్యాలయానికి తాళాలు వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. నామినేషన్ పత్రాలు చించివేశారన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలో కోనకనమిట్లలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.




