Konakanamitla: కొనకనమిట్లలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు!
Konakanamitla: కొనకనమిట్ల వద్దిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించిన హెచ్ఎం నరసింహారావు.
Konakanamitla: కొనకనమిట్లలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు!
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వద్ది మడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళ్లూరి నరసింహారావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. రైతుల సమస్యల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి వారి సంక్షేమం కోసం పోరాడిన నాయకుడిగా పటేల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
దేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి దేశ సమైక్యతకు, సమగ్రతకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఏర్పాటు చేసిన విషయాన్ని విద్యార్థులకు వివరించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ఐక్యతా భావాన్ని అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసూనాదేవి, ప్రసాదరావు, పద్మజ, వెంకటేశ్వర్లు, భార్గవి, మల్లయ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.




