Komarolu: చెన్నై సమీపంలో రైలు ప్రమాదంలో కొమరోలు వాసి మృతి!

Komarolu: ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన షేక్ ఖాజావలి చెన్నై రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏటీఎం కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించిన పోలీసులు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 11 Nov 2026 7:18 AM IST
Komarolu
X

Komarolu: చెన్నై సమీపంలో రైలు ప్రమాదంలో కొమరోలు వాసి మృతి!

Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణానికి చెందిన షేక్ ఖాజావలి అనే వ్యక్తి చెన్నై రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందాడు. రైలు నుంచి జారిపడి ఉండవచ్చని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతుడి జేబులో దొరికిన ఏటీఎం ఆధారంగా మృతుడి వివరాలు గుర్తించారు.చెన్నైలో రైలు ప్రమాదంలో మరణించిన అతను కొమరోలు కు చెందిన డాక్టర్ మొహమ్మద్ హుస్సేన్ అల్లుడు ఇతని భార్య రజియా ఏ.ఎన్.ఎమ్. గా పోదలకుంట పల్లెలో పనిచేస్తుందని తెలిసింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU