Komarolu: కొమరోలులో 'సుభోజనం': ఇంటి వద్దకే ఉచిత క్యారేజీలు

Komarolu: కొమరోలు మండలంలో ఆదరణ లేని వృద్ధులు, రోగుల కోసం కామూరి రమణారెడ్డి 'సుభోజనం' ప్రారంభించి 125 కుటుంబాలకు ఇంటి వద్దకే ఆహార క్యారేజీలు పంపిణీ చేస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 5 Oct 2026 3:45 PM IST
Komarolu
X

Komarolu: కొమరోలులో 'సుభోజనం': ఇంటి వద్దకే ఉచిత క్యారేజీలు

మార్కాపురం జిల్లా: కొమరోలు మండలంలో సోమవారం సుభోజనం కార్యక్రమాన్ని కామూరి రమణారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. నాఅనే వాళ్ళ ఆదరణ కరువై పేదరికంతో ఇబ్బంది పడుతూ మంచానికే పరిమితమైన వారిని గుర్తించి రెండు పుట్టల క్యారేజీతో ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రమణారెడ్డి తెలిపారు.

ఇప్పటివరకు కొమరోలు మండలంలో 125 కుటుంబాలకు నేరుగా ఇంటి వద్దకే ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. గతంలో బేస్తవారిపేట మండలంలో సుభోజనం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ 75 కుటుంబాల వరకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.

ఇక రాజన్న భోజనశాల ద్వారా 9 సంవత్సరాలుగా పేదల కడుపు నింపుతున్నామని నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు పేదలకు కడుపు నింపేందుకే తన సేవలు సాగుతాయని రమణారెడ్డి అన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU