Markapuram: కనిగిరి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లెల ప్రవీణ్ కుమార్!

Markapuram: కనిగిరి మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లెల ప్రవీణ్ కుమార్ రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ అందజేసి, ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Guravayya, Kanigiri
Published on: 27 Oct 2026 5:00 PM IST
Markapuram
X

Markapuram: కనిగిరి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లెల ప్రవీణ్ కుమార్!

Markapuram: కనిగిరి మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లెల ప్రవీణ్ కుమార్ మంగళవారం మార్కాపురంలోని మెప్మా కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ అందజేశారు.

ఈ సందర్భంగా మల్లెల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సహకారంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

జడ్పీటీసీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి, ఆశీర్వదించి గెలిపించాలని కనిగిరి మండల ప్రజలు, ఓటర్లను ఆయన కోరారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri