Kanigiri: మున్సిపాలిటీని కైవసం చేసుకుందాం డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
Kanigiri: కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఐక్యమత్యంతో పనిచేసి అన్ని వార్డులు గెలవాలని ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.
Kanigiri: మున్సిపాలిటీని కైవసం చేసుకుందాం డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: రానున్న మున్సిపల్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ఐక్యమత్యంతో గెలిపించి, మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు.
శనివారం కనిగిరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో, 32 వార్డుల వార్డు అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ.. ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి, 32 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 32 మంది వార్డు అధ్యక్షులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




