Dornala: తండ్రి విజయం కోసం తనయుడి ప్రచారం!
Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాళలో కూటమి అభ్యర్థుల తరఫున కందుల రోహిత్ ప్రచారం. జడ్పీటీసీ అభ్యర్థి కందుల రామిరెడ్డి, ఎంపీటీసీ-1 అభ్యర్థిని గుంటూరు అనూష విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం.
Dornala: తండ్రి విజయం కోసం తనయుడి ప్రచారం!
Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ చైర్మన్ అభ్యర్థి కందుల రామిరెడ్డి విజయమే లక్ష్యంగా ఆయన తనయుడు కందుల రోహిత్ ప్రచార బరిలోకి దిగారు.
ఎంపీటీసీ-1 అభ్యర్థిని గుంటూరు అనూషతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
పెద్ద దోర్నాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ షేక్ మాబు, మాజీ సర్పంచ్ పెచ్చ హరిగోపాల్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం అమ్మవారి శాల వీధి నుంచి మెట్ట బజార్ వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
జడ్పీటీసీ అభ్యర్థి కందుల రామిరెడ్డిని గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై, ఎంపీటీసీ-1 అభ్యర్థిని గుంటూరు అనూషకు గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు జేడీ లక్ష్మయ్య, పబ్బతి, మురళి, పండు తదితరులు పాల్గొన్నారు.




