Peddadornala: పెద్దదోర్నాలలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జేసీ పులి శ్రీనివాసులు!
Peddadornala: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన చేపట్టిన జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు.
Peddadornala: పెద్దదోర్నాలలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జేసీ పులి శ్రీనివాసులు!
Peddadornala: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను జిల్లా సబ్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. జిల్లా పరిధిలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
నామినేషన్లకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు తదుపరి అవకాశం ఉంటుందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ విజయ సునీత జిల్లా ఎస్పీ ఫంకస్ కుమార్ మీనా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేశారు.
పార్టీ అభ్యర్థులు రాజకీయ నాయకులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో వేణుగోపాలరావు, ఎంపీడీవో విజయ తహసీల్దార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




