Markapur: పెద్ద దోర్నాల నూతన ఎస్‌ఐగా నాగరాజు బాధ్యతల స్వీకరణ!

Markapur: మార్కాపురం పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా జె. నాగరాజు బాధ్యతలు స్వీకరణ; శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలే తన ప్రాధాన్యమని వెల్లడి.

Srikanth Singam, Markapur
Updated on: 24 Sept 2026 12:49 PM IST
Markapur
X

Markapur: పెద్ద దోర్నాల నూతన ఎస్‌ఐగా నాగరాజు బాధ్యతల స్వీకరణ!

Markapur: పెద్ద దోర్నాల పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్‌ఐగా జె. నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనను పెద్ద దోర్నాల పోలీస్‌ స్టేషన్‌కు ఎస్‌ఐగా నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది నూతన ఎస్‌ఐ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వివిధ అంశాలపై సిబ్బందితో ఆయన వివరాలు తెలుసుకున్నారు.

మండలంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur