Markapuram: మార్కాపురం అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థిగా గోళ్ల అపర్ణ పోటీ. పట్టణాభివృద్ధి, స్వచ్ఛమైన తాగునీరు, విద్యా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన అపర్ణ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Oct 2026 11:37 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి!

Markapuram: పట్టణ అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని మార్కాపురం మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి గోళ్ల అపర్ణ తెలిపారు.

మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు.

పట్టణంలోని సమస్యలను గుర్తించి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని గోళ్ల అపర్ణ పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM