Prakasam: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల బాలికపై దారుణం!
Prakasam: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళన.
Prakasam: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల బాలికపై దారుణం!
Prakasam: నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు వచ్చిన సమాచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి బయట నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బాలికపై దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్‌ను గ్రామస్థులు పట్టుకుని దాడి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అయితే, నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.




