Yerragondapalem: ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ ఘర్షణ

Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.

Srikanth Singam, Markapur
Published on: 22 Oct 2026 4:42 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ ఘర్షణ

మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు టీడీపీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేయగా, ఆ తర్వాత వైసీపీ సభ్యులు నామినేషన్లు వేయడానికి రావాలని అధికారులు సూచించినట్లు సమాచారం.

అయితే, రెండు గంటల అనంతరం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ సభ్యులను అక్కడే గుమిగూడి ఉన్న టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరోవైపు, వైసీపీ సభ్యులను నామినేషన్లు వేయకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని, పోలీసులు వారికి మద్దతుగా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎర్రగొండపాలెంలో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘర్షణ స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur