Prakasam: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఆల్ఫ్రెడ్ ఫౌండేషన్ క్రీడాకారులు

Prakasam: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో గుర్రం ఆల్ఫ్రెడ్ క్రికెట్ ఫౌండేషన్ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 3 Oct 2026 3:39 PM IST
Prakasam
X

Prakasam: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఆల్ఫ్రెడ్ ఫౌండేషన్ క్రీడాకారులు

Prakasam: ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒంగోలు లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ప్రకాశం ఆధ్వర్యంలో జరిగిన అండర్ 14 బాలుర క్రికెట్ ఎంపిక లో విశ్వభారతి ఐఐటి ఫౌండేషన్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న పి. ఉమర్ ఖాన్,రఘుపతి. నవదీప్ రాయల్ , అండర్ 19 బాలికల క్రికెట్ లో నారాయణ హైస్కూల్లో చదువుతున్న బి.గాయత్రి, మనస్విని,తేజస్విని, ఆర్ ఆర్ స్కూల్లో .8వ తరగతి చదువుతున్న షేక్ అర్షియా మరియు అండర్ 17 బాలికల క్రికెట్లో, జిల్లా పరిషత్ (బాలికల )ఉన్నత పాఠశాల గిద్దలూరు నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న షేక్ కరిష్మా ఎంపికైనట్లు గుర్రం ఆల్ఫ్రెడ్ క్రికెట్ ఫౌండేషన్ హెడ్ కోచ్ జి.శోభన్ బాబు, కోచ్ డి.మనోజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU