Markapuram: గ్రీన్ మార్కాపురం దిశగా మరో ముందడుగు

Markapuram: మార్కాపురంలో పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం లక్ష్యంగా గ్రీన్ మార్కాపురం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Nov 2026 5:26 PM IST
Markapuram
X

Markapuram: గ్రీన్ మార్కాపురం దిశగా మరో ముందడుగు

మార్కాపురం: మార్కాపురం పట్టణాన్ని పచ్చదనంతో నింపి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే మంచి సంకల్పంతో *గ్రీన్ మార్కాపురం* కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాలి రాములు, మస్తాన్, రేవంత్, జాకీర్, రజా, నాయబ్, రషీద్, జలంధర్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెద్ద చేయడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

ఒక్కొక్కరి చిన్న ప్రయత్నం.. మార్కాపురానికి పచ్చని భవిష్యత్తు!

మన ఊరు – మన బాధ్యత

మన మొక్కలు – మన భవిష్యత్తు

గ్రీన్ మార్కాపురం – పచ్చదనమే మన లక్ష్యం..కర్త: సయ్యద్ రఫీ.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM