Markapuram: మార్కాపురంలో రూ.57 లక్షల కరెన్సీ నోట్లతో ముద్దసానమ్మ అమ్మవారి అలంకరణ!

Markapuram: మార్కాపురం కొలభీమునిపాడు శ్రీ ముద్దసానమ్మ అమ్మవారు రూ.57 లక్షల కరెన్సీ నోట్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Oct 2026 9:52 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో రూ.57 లక్షల కరెన్సీ నోట్లతో ముద్దసానమ్మ అమ్మవారి అలంకరణ!

Markapuram: మార్కాపురం మండలం కొలభీమునిపాడు గ్రామ సమీపంలోని శ్రీ ముద్దసానమ్మ అమ్మవారు రూ.57 లక్షల కరెన్సీ నోట్లతో చేసిన విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కరెన్సీ నోట్లతో వైభవంగా అలంకరించారు.

ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కరెన్సీ నోట్లతో చేసిన విశేష అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM