Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
రాచర్ల, గిద్దలూరు, అర్ధవీడు జడ్పిటిసి లకు చిన్న కంభం, బేస్తవారిపేట 1, తిమ్మాపురం ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.
సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 72 ఎంపీటీసీలు, 3 జడ్పిటిసిలు ఏకగ్రీవమయ్యాయి.




