Giddalur: గిద్దలూరు 9వ వార్డులో రసవత్తరంగా మారిన ఎన్నికల రాజకీయం!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ 9వ వార్డులో రసవత్తరంగా రాజకీయం. టీడీపీ నుంచి ఎలిశెట్టి రవణమ్మ, జనసేన నుంచి బెతంశెట్టి శ్యామల బరిలో.. వైఎస్సార్‌సీపీ నుంచి సల్మా.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 26 Oct 2026 4:29 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు 9వ వార్డులో రసవత్తరంగా మారిన ఎన్నికల రాజకీయం!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారిందని కూటమిలో భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్థులు వేర్వేరుగా బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

టీడీపీ అభ్యర్థిగాఎలిశెట్టి రవణమ్మ, జనసేన పార్టీ అభ్యర్థిగా బెతంశెట్టి శ్యామల పోటీలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్. సల్మా బరిలో ఉన్నారు. టీడీపీ, జనసేన ఇరువురు అభ్యర్థులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి షేక్. సల్మా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు.

కూటమి పార్టీల అభ్యర్థులు ఇద్దరూ పోటీలో ఉండటంతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఒకే కూటమికి చెందిన పార్టీల అభ్యర్థులు వేర్వేరుగా పోటీ చేయడం ఓట్ల సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 9వ వార్డులో గెలుపోటములకు ఎన్నికల ప్రచారం, ఓటర్ల మద్దతు కీలకంగా మారనుంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU