Giddalur: తౌసిఫ్, మౌలాబీ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
Giddalur: గిద్దలూరులో సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ పత్రికా సమావేశం నిర్వహించి, అక్టోబర్ 12న ఒంగోలు కలెక్టరేట్...
Giddalur: తౌసిఫ్, మౌలాబీ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
గిద్దలూరు: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు పట్టణంలోని ఖాదర్ వలి స్వామి దర్గాలో ఈ రోజు సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ వై కె విశ్వనాధ్ మాదిగ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ థౌసిక్ మరియు మౌలాబీ తల్లీ కొడుకుల మృతులకు కారకులైన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలనీ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి విద్యార్థి సయ్యద్ తౌసిఫ్, పుత్రశోకంతో తల్లి మౌలాబి నా కొడుకును హత్యచేసి నాకు కడుపు కోత మిగిల్చారని స్కూల్ ముందే 7నెలలపాటు నిరసన వ్యక్తంచేసి రాజ్యాంగ వ్యవస్థలు తనకు న్యాయం చేయలేదని చివరికి సెప్టెంబర్ 12 న ఆత్మహత్య చేసుకొని మరణించిందనీ ఆయనఅన్నారు.
ఈ మరణాలకు సంబంధించి బాధితులకు న్యాయం జరగకపోవడం వలన సెప్టెంబర్ 21వ తేదీన ఒంగోలు జిల్లా కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది.కానీ అధికారుల నుండి గానీ, ప్రభుత్వం నుండి గానీ ఎలాంటి స్పందన లేకపోవడం వలన అక్టోబర్ ఒకటవ తేదీన ఒంగోలు అంబేద్కర్ హాల్లో ముస్లిం మైనార్టీ సంఘాలు, దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల తరపున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు కలసి ధర్నా చేయాలని నిర్ణయించడమైనది. అక్టోబర్ 12వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా 50 వేల మందితో మహాధర్నా చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మరియు దళిత బహుజన సంఘాలు నిర్ణయించాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు గిద్దలూరు కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ ప్రసంగించారు.అయన మాట్లాడుతూ ఈ మహాధర్నాలో భాగంగా అన్ని నియోజకవర్గాలలో సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుచున్నవి. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 2 గంటలకు గిద్దలూరు షాదిఖానలో ఛలో ఒంగోలు కలెక్టరేట్ మహాధర్నా విజయవంతం కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారు,
కావున 9వ తేదీ గిద్దలూరు నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ దళిత బహుజన సంఘాల నాయకులు ప్రజాస్వామికవాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని అక్టోబర్ 12న ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరుగు మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,కొండేపోగు దేవ ప్రభాకర్, MSP నియోజకవర్గ ఇంచార్జ్ ,మహబూబ్ బాషా, మైనారిటీ ఆధ్యక్షులు,పఠాన్ కాదర్ ఖాన్, మౌలానా అబ్దుల్ రషీద్, హఫీజ్ ఉస్మాన్ ,పఠాన్ లతీఫ్ ఖాన్, షైక్ దాదాపీరా, K.వెంకటేశ్వర్లు మాదిగ, MRPS గిద్దలూరు,ఇంచార్జ్, సందాల కాసయ్య మాదిగ, మండల MSP ఆధ్యక్షులు, కాలువ భాస్కర్, MSP అధికారప్రతినిధి, K పెద్దఓబయ్య మాదిగ, MRPS మండల ఆధ్యక్షులు, D నాగరాజు మాదిగ, MRPS అధికారప్రతినిధి, సిరివెళ్ల ఆంటోనీ MRPS టౌన్ ఆధ్యక్షులు పాల్గొన్నారు.




