Giddalur: గిద్దలూరు మండలం ముండ్లపాడులో మాజీ సైనికుల పెన్షన్ అవగాహన సదస్సు!
Giddalur: ముండ్లపాడులో జెడ్ఎస్డబ్ల్యూఓ ఆధ్వర్యంలో మాజీ సైనికుల పెన్షన్ అవగాహన సదస్సు నిర్వహించి, సమస్యలు పరిష్కరించి గుర్తింపు కార్డులు జారీ చేశారు.
Giddalur: గిద్దలూరు మండలం ముండ్లపాడులో మాజీ సైనికుల పెన్షన్ అవగాహన సదస్సు!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం, ముండ్లపాడులో ఈ రోజు మాజీ సైనికుల పెన్షన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ZSWO మార్కాపురం & సిబ్బంది పాల్గొని పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించారు. పలువురు మాజీ సైనికులకు/వితంతువులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమం ముండ్లపాడు మాజీ సైనికులు సంఘం అధ్యక్షుడు కెప్టన్. G. వెంకటేశ్వర్లుతో పాటు వారి కార్యవర్గ సభ్యులు డి. సురేష్, S. వెంకటేశ్వర్లు, GV రెడ్డి , సతీష్, గిద్దలూరు నియోజక వర్గ మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు , JAC సబ్యులు పాల్గొన్నారు.
Lt Col అబ్దుల్ రహీం ZSWO మార్కాపురం మరియు సిబ్బంది GVV సుధాకర్ సీనియర్ అసిస్టెంట్, D రామకృష్ణ రెడ్డి వెల్ఫేర్ ఆర్గనైజర్ అందరికి jac సభ్యులు కృతఙ్ఞతలు తెలియజేశారు.




