Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ ఆంధ్ర' అవార్డు

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించింది. విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కమిషనర్ రమణబాబు అవార్డు అందుకున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 2 Oct 2026 11:19 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ ఆంధ్ర' అవార్డు

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మున్సిపాలిట అవార్డుకు ఎంపికైంది.

ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణబాబు అవార్డును అందుకున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం తదితర అంశాల్లో చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU