Giddalur: ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ముత్తుముల కృష్ణ కిషోర్!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు.
Giddalur: ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ముత్తుముల కృష్ణ కిషోర్!
గిద్దలూరు: గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోదరులు ముత్తుముల కిషోర్ కృష్ణ కిషోర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా గిద్దలూరు మున్సిపాలిటీని బిజెపి పార్టీకి కేటాయించింది అయితే గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి కృష్ణ కిషోర్ రెడ్డి స్వయాన సోదరుడు కావడం విశేషం.
కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణ అభివృద్ధి కొరకు కూటమి ధర్మాన్ని అనుసరించి నామినేషన్ దాఖలు చేస్తున్నానని తెలిపారు. గిద్దలూరు తాగునీరు మరియు డ్రైనేజీ సమస్య పట్టణ సమస్యలు తీర్చి గిద్దలూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని నేను స్థానికున్ని కాబట్టి అందరూ నాకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న అనుచరులు, మద్దతుదారులు.




