Giddalur: గిద్దలూరు ఎన్నికల బరిలో సీపీఎం: 21వ వార్డుకు నామినేషన్

Giddalur: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం బరిలోకి దిగింది. 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు ప్రజా సమస్యల అజెండాతో నామినేషన్ దాఖలు చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Oct 2026 12:51 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు ఎన్నికల బరిలో సీపీఎం: 21వ వార్డుకు నామినేషన్

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు సీపీఎం కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో వార్డుల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా సీపీఎం అభ్యర్థి బరిలో నిలిచారు. రానున్న రోజుల్లో వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లతో గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU