Giddalur: తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: అశోక్ రెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చారు.
Giddalur: తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: అశోక్ రెడ్డి!
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, వార్డు ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే పట్టణంలోని ప్రస్తుత నీటి సరఫరా పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరా, అందుబాటులో ఉన్న నీటి వనరులు, పనిచేయని బోర్లు, వాటి మరమ్మతుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరిష్కారానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సంబంధిత గౌరవ మంత్రివర్యులతో ఫోన్‌లో మాట్లాడారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేయాలని, మరమ్మతులకు గురైన బోర్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, నీటి సరఫరా విషయంలో వార్డుల వారీగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ప్రజల తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ రమణ బాబు , అధికారులు, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు.




