Giddalur: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల జోరు

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండో రోజు 50 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటితో (అక్టోబర్ 18) నామినేషన్ల గడువు ముగియనుంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Oct 2026 9:02 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల జోరు

మార్కాపురం జిల్లా: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 2వ రోజు ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 2వ రోజు 50 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు.

టిడిపి 27, వైసిపి 17, జనసేన 2, ఇండిపెండెంట్ లు 4 నామినేషన్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. వైసీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఈనెల 18వ తేదీ అంటే రేపు నామినేషన్లకు ఆఖరి తేదీ అని ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU