Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్‌గా నారాయణ, వైస్ చైర్మన్‌గా శ్రీదేవి, 28 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం; ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరు.
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్ నారాయణకు, వైస్ చైర్మన్ శ్రీదేవిని అభినందించారు. అలానే కూటమి తరుపున గెలిచిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత సమస్యలను పరిష్కారానికి నూతన పాలకవర్గంతో కలిసి పని చేస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.
ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కి చైర్మన్ నారాయణ, వైస్ చైర్మన్ శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తామని తెలిపారు. టిడిపి తరఫున 25 మంది, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు, వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి ఒకరు ప్రమాణస్వీకారం చేశారు.




