Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డా. జే.వి. నారాయణకు ఘన సన్మానం

Giddalur: విజయవాడలో జరిగిన బీజేపీ పంచాయతీ సమాయత్త సదస్సులో గిద్దలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ జే.వి. నారాయణను పురంధరేశ్వరి, మాధవ్ ఘనంగా సత్కరించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 10 Nov 2026 3:29 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డా. జే.వి. నారాయణకు ఘన సన్మానం

మార్కాపురం జిల్లా: విజయవాడలో నేడు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పంచాయతీ ఎన్నికల సమాయత్త సమావేశంలో గిద్దలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ జే.వి. నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజా సేవలో, స్థానిక అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న డా. జే.వి. నారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, బీజేపీ సీనియర్ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై బీజేపీ పోరాట కార్యాచరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU