Giddalur: గిద్దలూరులో వరుణ యాగం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

Giddalur: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ గిద్దలూరు శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 6 Oct 2026 3:20 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో వరుణ యాగం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

గిద్దలూరు: కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం దేశంలో , రాష్ట్రంలో ఎలినో ప్రభావంతో వాతావరణం పరిస్థితులు సరిగా లేదని వర్షాలు సరిగా పడటంలేదని రాష్ట్రంలోని 175 దేవాదాయ, ధర్మాదాయ ఆలయాలలో వరుణ దేవుని యాగం నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాల నాగేశ్వరస్వామి దేవస్థానం నందు వరుణ దేవుని యాగం నందు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక పూజలు , యాగంలో పాల్గొని వర్షాలు సంమృద్ధిగా కురవాలి అని ప్రార్ధించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎలినో ప్రభావంతో అత్యంత తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి దీని నుండి మన రాష్ట్రంలో వర్షాలు సక్రమంగా పడి సుభిక్షంగా ఉండాలని మన గిద్దలూరు నియోజకవర్గంలో కూడా వర్షాలు పూర్తిస్థాయిలో పడి ఈ ప్రాంతంలో కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆదేశానుసారం శ్రీ పాతాళ నాగేశ్వరావు దేవాలయంలో వరుణ యాగంలో పాల్గొనడం జరిగింది.

ఈ దేవాలయంలోని శివపార్వతుల ఆశీస్సులతో మా భక్తి శ్రద్ధ పూజలతో తప్పకుండా వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా పడాలని రాష్ట్రమంతా మరియు నియోజకవర్గంలో వర్షాలు పడి సుభిక్షంగా ఉండి ఏలినో ప్రభావం నుండి రైతులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రముఖులు, దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు , భక్తులు ఈ వరుణ దేవుని యాగంలో పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU