Giddalur: ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు - ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: గిద్దలూరు పట్టణంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
Giddalur: ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు - ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీటి సరఫరా సక్రమంగా, సమయానికి చేరేలా స్వయంగా వెళ్లి,పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వాటర్ బోర్డు కమిటీ సభ్యులు, పట్టణ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి వార్డులో నీటి అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
వారి ఆదేశాను సారం కమిటీ సభ్యులు ఉదయం నుండి అన్ని వార్డులలో తిరిగి నీటి సరఫరా, ట్యాంకర్లు ఫిల్లింగ్ పాయింట్, వంటి వాటిని తిరిగి పరిశీలించి ప్రజలు నీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వార్డుల్లో ఇంటింటికి తిరిగి పర్యవేక్షణ చేసి
నీటి ట్యాంకర్ల రూట్ మార్గాలు, వాటర్ ఫిల్లింగ్ పాయింట్లు, ట్యాంకర్ల రాకపోకలు, వార్డుల వారీగా నీటి పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరిగింది. ప్రజల నుంచి వచ్చే నీటి సరఫరా సమస్యలను వెంటనే గుర్తించి నీటి సమస్య అధికంగా ఉండే ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి నీటి సరఫరా కు కృషి చేస్తున్నారు.




