Giddalur: గిద్దలూరులో ఉద్రిక్తత.. నామినేషన్ పత్రాలు చించివేత

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కేంద్రంలోకి చొరబడిన దుండగులు బీజేపీ అభ్యర్థుల పత్రాలు చించివేశారు. బీజేపీ నేతలు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Oct 2026 4:07 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఉద్రిక్తత.. నామినేషన్ పత్రాలు చించివేత

మార్కాపురం జిల్లా: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ పత్రాలు చించి వేశారని బిజెపి నాయకులు నామినేషన్ పరిశీలన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. నామినేషన్లు పరిశీలిస్తున్న కార్యాలయంలోకి కొంతమంది వ్యక్తులు వెళ్లి నామినేషన్ పత్రాలు చించి వేశారు.

తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. అయితే విషయాన్ని తెలుసుకున్న బిజెపి నాయకులు హుటాహుటిన కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. బిజెపి చైర్మన్ అభ్యర్థి జేవి నారాయణ నామినేషన్ పత్రాలతో పాటు బిజెపి నాయకుల నామినేషన్ పత్రాలను చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు దుండగులు నామినేషన్ పత్రాలు చించివేశారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఎవరి నామినేషన్ పత్రాలు చించివేశారో పరిశీలిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU