Giddalur: మున్సిపల్ కమిషనర్ రమణబాబును అభినందించిన కలెక్టర్
Giddalur: స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు పొందిన గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణబాబును జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రత్యేకంగా అభినందించారు.
Giddalur: మున్సిపల్ కమిషనర్ రమణబాబును అభినందించిన కలెక్టర్
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ EV. రమణబాబును జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కలెక్టరేట్ లోని ఆమె చాంబర్లో శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ మున్సిపాలిటీ -2026 అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపికైంది.
మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్, వేస్ట్ టు కంపోస్ట్ ప్లాంట్, లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం తదితర అంశాల్లో కమిషనర్ చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గిద్దలూరు మున్సిపాలిటీకి కు ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




