Giddalur: దిగువమెట్ట తండాలో మేనావత్ లలిత గెలుపే లక్ష్యంగా ప్రచారం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మేనావత్ లలిత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 26 Nov 2026 11:47 AM IST
Giddalur
X

Giddalur: దిగువమెట్ట తండాలో మేనావత్ లలిత గెలుపే లక్ష్యంగా ప్రచారం!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన మేనావత్ లలిత (w /o విశ్రాంత పోలీస్ అధికారి మేనావత్ బాలాజీ నాయక్) గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. గ్రామ పంచాయతీ ప్రజలందరూ తమకు మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేనావత్ లలిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU