Giddalur: గిద్దలూరులో మెగా జాబ్ మేళా.. 74 మందికి ఉద్యోగ అవకాశాలు

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాకు భారీ స్పందన; వివిధ కంపెనీల్లో 74 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 25 Nov 2026 9:53 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో మెగా జాబ్ మేళా.. 74 మందికి ఉద్యోగ అవకాశాలు

గిద్దలూరు: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరై ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. మొత్తం 74 మందిని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారమే లక్ష్యంగా కళాశాల ముందుకు సాగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జాబ్ మేళాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU