Gundeddipalle: ప్రజలతో మమేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నాయకులు!

Gundeddipalle: మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గుండెడ్డిపల్లె గ్రామంలో వినాయక చవితి వేడుకలు.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కామూరి రమణారెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Sept 2026 3:32 PM IST
Gundeddipalle
X

Gundeddipalle: ప్రజలతో మమేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నాయకులు!

Gundeddipalle: మార్కాపురం జిల్లా కొమరోలు వినాయక చవితి గణేష్ ఉత్సవాల సందర్భంగా దద్దవాడ పంచాయతీ పరిధిలోని గుండెడ్డిపల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కామూరి రమణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులను, గ్రామ ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU