Podili: పొదిలిలో మానవతా ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Podili: పొదిలిలో మానవతా ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద శ్రీ వాసవి అమ్మవారి శాల సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు మానవతా కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ‘అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మానవతా కమిటీ సభ్యులు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవతా జిల్లా అధ్యక్షులు మువ్వల పార్థసారథి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చేసిన త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు.
సంస్థ ఛైర్మన్ కాటూరి నారాయణ బాబు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ వంటి మహనీయుల సేవలను, త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానవతా పొదిలి శాఖ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




