Giddalur: గిద్దలూరు పొదిలికొండపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సూచనతో పొదిలికొండపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం. 120 మందికి పరీక్షలు, 15 మందికి ఉచిత ఆపరేషన్లకు ఏర్పాట్లు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 13 Oct 2026 7:10 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు పొదిలికొండపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

గిద్దలూరు: మార్కాపురం జిల్లా ,, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సూచన మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరం ఉదయానంద హాస్పిటల్స్ నంద్యాల వారిచేత గిద్దలూరు మండలం పొదిలికొండపల్లి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణమునందు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం స్థానికులు కీ "శే "చేరెడ్డి జయరామిరెడ్డి కీ "శే " చేరెడ్డి ఈశ్వర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేరెడ్డి మాధవి భర్త రమణారెడ్డి సహకారంతో చేరెడ్డి జయరామిరెడ్డి ఆవుల రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదిలికొండపల్లి పరిసర గ్రామాలు నుండి దాదాపుగా 120 మంది పేషెంట్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం జరిగింది.

వీరందరికీ ఉదయానంద హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఆపరేషన్ చేయవలసిన వారిని రేపు అనగా బుధవారం రోజు నంద్యాల హాస్పటల్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయడం కోసం దాదాపుగా 15 మందికి ఉచిత ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేయటం జరిగింది.

ఆపరేషన్ చేయించుకొనేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొంటు బ్రహ్మానందరెడ్డి,చేరెడ్డి బైపి రెడ్డి,నంద్యాల ఖాసిం, చేరెడ్డి చిన్న పాపిరెడ్డి,కాల్వ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU