Markapuram: పెద్ద దోర్నాలలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జంకె ఆవులరెడ్డి మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్న దోర్నాలలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జంకె ఆవులరెడ్డి మృతి. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి.

Srikanth Singam, Markapur
Published on: 26 Oct 2026 3:02 PM IST
Markapuram
X

Markapuram: పెద్ద దోర్నాలలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జంకె ఆవులరెడ్డి మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంచిన్న దోర్నాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు జంకె ఆవులరెడ్డి అనారోగ్యంతో వయో భారంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి గ్రామానికి చేరుకుని ఆవులరెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి ఆవులరెడ్డి వన్నె తెచ్చారని, పదవీ విరమణ అనంతరం వైఎస్సార్‌సీపీ కోసం శక్తివంచన లేకుండా పనిచేశారని వెంకటరెడ్డి కొనియాడారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరచిపోమని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur