Markapuram: గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా

Markapuram: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాపూజీ చిత్రపటానికి ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పూలమాల వేసి నివాళులర్పించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 2:26 PM IST
Markapuram
X

Markapuram: గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్య మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, భద్రత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుత, న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

గాంధీ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎండీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పోలీసు సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీజీకి నివాళులర్పించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM