Kommalapaadu: వద్ద నామ్ హైవేపై రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్!

Kommalapaadu: ప్రకాశం జిల్లా కొమ్మాలపాడు వద్ద విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలపై నామ్ హైవేపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Kolla Singaiah, Addanki
Published on: 14 Oct 2026 4:36 PM IST
Kommalapaadu
X

Kommalapaadu: వద్ద నామ్ హైవేపై రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్!

Kommalapaadu: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద నామ్ హైవేపై ధర్నా చేపట్టిన రైతులు, వ్యవసాయ పనులకు వినియోగించే కరెంటు ఒకవైపు లో వోల్టేజ్ సమస్యతో ఉండగా మరోవైపు విద్యుత్ సరఫరా అంతరాయం చేస్తూ కోతలు వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు నామ్ హైవేపై రాస్తారోకోతో వాహనాలు భారీగా ట్రాఫిక్ లో నిలిచిపోయాయి. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రైతులు కరెంటు కార్యాలయం వద్ద ముట్టడి చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను హైవేపై చెదరగొట్టి పక్కకు తీసుకెళ్లారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki