Markapuram: మార్కాపురం జిల్లాలో 21 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్!
Markapuram: మార్కాపురం జిల్లాలో 21 మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు.
Markapuram: మార్కాపురం జిల్లాలో 21 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్!
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో 21 మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2026–27 నిబంధనల మేరకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.
అక్టోబర్ 1 అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపారు.
అక్టోబర్ 5న మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్లో కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి మద్యం దుకాణాలను ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం వెల్లడించారు.




