Markapur: చక్రవడ్డీతో సహా తీర్చుకుంటాం: అన్నా రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

Markapur: కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా తీర్చుకుంటామని మార్కాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 Sept 2026 3:31 PM IST
Markapur
X

Markapur: చక్రవడ్డీతో సహా తీర్చుకుంటాం: అన్నా రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

మార్కాపురం జిల్లా: మార్కాపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు కూటమి నాయకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని చక్రవడ్డీతో సహా తీర్చుకోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీ శ్రేణులతో సమావేశమైన అన్నా రాంబాబు.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.

కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM