Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీ రేసులో ఎర్వ శేష సేనారెడ్డి!

Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎర్వ శేష సేనారెడ్డి పోటీకి ఆసక్తి. ఎమ్మెల్యే తాటిపర్తి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Oct 2026 10:02 AM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీ రేసులో ఎర్వ శేష సేనారెడ్డి!

Peddaraveedu: పెద్దారవీడు మండలం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దారవీడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ పదవిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఎంపీపీ పదవికి ఎర్వ శేష సేనారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ నాయకత్వం , ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అవకాశం కల్పిస్తే ఎంపీపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యే తాటిపర్తి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని శేష సేనారెడ్డి పేర్కొన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో పెద్దారవీడు ఎంపీపీ పదవికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM