Markapuram: పరిశుభ్రతలో సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్!

Markapuram: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్‌కు 'స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర' బెస్ట్ అవార్డు లభించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Oct 2026 2:02 PM IST
Markapuram
X

Markapuram: పరిశుభ్రతలో సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్!

Markapuram:స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎర్రగొండపాలెం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్‌కు జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ బెస్ట్ అవార్డు లభించింది.

గాంధీ జయంతిని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి చేతుల మీదుగా, డిటి డబ్ల్యూ ఓ వెంకటేశ్వర్లు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్. జయలక్ష్మి అవార్డును స్వీకరించారు.

స్వచ్ఛ హాస్టల్‌.. ఆరోగ్యకరమైన విద్యార్థినులు

హాస్టల్‌లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతతో పాటు స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యానికి ఎంతో అవసరమనే ఉద్దేశంతో సిబ్బంది సమిష్టిగా చేస్తున్న కృషిని అధికారులు గుర్తించి జిల్లా స్థాయిలో ఉత్తమ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్‌గా ఎంపిక చేశారు.

సిబ్బందినీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయలక్ష్మి అభినందనలు

హాస్టల్‌కు జిల్లా స్థాయి అవార్డు లభించడంపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్. జయలక్ష్మి సిబ్బందిని అభినందించారు. ఈ అవార్డు సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో స్వచ్ఛత కార్యక్రమాలను కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM