Markapuram: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డిని గెలిపించండి!

Markapuram: పెద్ద దోర్నాలలో కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం. మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డిని గెలిపించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు విజ్ఞప్తి.

Srikanth Singam, Markapur
Published on: 29 Oct 2026 7:29 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డిని గెలిపించండి!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద దోర్నాల మండలంలో నిర్వహించిన కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని అభ్యర్థులను పరిచయం చేశారు.

ఈ సందర్భంగా దోర్నాల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా, మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల రామిరెడ్డి, మండల ఎంపీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భూమని నాగమ్మతో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను పరిచయం చేశారు. అభ్యర్థుల విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం కందుల రామిరెడ్డికి కల్పించాలని ఎరిక్షన్ బాబు కోరారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ఆయనను పార్టీలకతీతంగా ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

అభివృద్ధికి ఓటు వేయండి

అనంతరం జడ్పీటీసీ అభ్యర్థి కందుల రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఒకరిగా తనను ఆదరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మాబు, బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, జడి లక్ష్మయ్య, దొడ్డ శేషాద్రి, చంటి, జంగిలి పిచ్చయ్య, కొప్పుల సుబ్బారెడ్డి, భూమని మంతన్న, బీజేపీ జిల్లా కార్యదర్శి తంగిరాల శేఖర్ రెడ్డి, జనసేన మండల కన్వీనర్ కేతి తి వెంకట మోహన్ మురళి, షేక్ మౌలాలి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur