Markapuram: మార్కాపురం జడ్పీ పీఠం రేసులో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి!

Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీజేపీకి దక్కితే డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డికి కీలక అవకాశం లభించే అవకాశం ఉంది. ఆయన దోర్నాల జడ్పీటీసీగా పోటీకి సిద్ధమవుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Oct 2026 8:57 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జడ్పీ పీఠం రేసులో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి!

Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. కూటమిలో టీడీపీ, బీజేపీ మధ్య పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. జడ్పీ చైర్మన్ పదవి బీజేపీకి దక్కితే రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

దోర్నా జడ్పీటీసీ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. గతంలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో పాటు, ఆయన చేపడుతున్న వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

అయితే, జడ్పీటీసీ అభ్యర్థిత్వం, చైర్మన్ పదవిపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. కూటమి అధిష్ఠానం నిర్ణయంపైనే ఏలూరి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM