Dornala: దోర్నాలలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ

Dornala: దోర్నాలలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పిలుపు.

Srikanth Singam, Markapur
Published on: 14 Oct 2026 7:52 PM IST
Dornala
X

Dornala: దోర్నాలలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ

దోర్నాల: దోర్నాల రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తూ వారిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సమావేశంలో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి పంచాయతీలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

దోర్నాల మండలంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur