Markapuram: స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధమవ్వాలిఎరిక్షన్ బాబు

Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాలలో స్థానిక ఎన్నికలపై టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు కూటమి నేతలతో సమావేశమై, విజయమే లక్ష్యంగా పిలుపునిచ్చారు.

Srikanth Singam, Markapur
Published on: 15 Oct 2026 11:28 PM IST
Markapuram
X

Markapuram: స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధమవ్వాలిఎరిక్షన్ బాబు

Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాలలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎరిక్షన్ బాబు సూచించారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ షేక్ మాబు, సీనియర్ నాయకులు షేక్ గఫూర్, బట్టు సుధాకర్ రెడ్డి, వల్లభనేని కాశయ్య, శేషాద్రితో పాటు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur