Markapuram: దోర్నాలలో ఎన్నికల వేడి: నామినేషన్ కేంద్రం వద్ద భద్రత!

Markapuram: దోర్నాలలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద ఎస్సై నాగరాజు పర్యవేక్షణలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 21 Oct 2026 1:43 PM IST
Markapuram
X

Markapuram: దోర్నాలలో ఎన్నికల వేడి: నామినేషన్ కేంద్రం వద్ద భద్రత!

Markapuram: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దోర్నాల మండలంలో రాజకీయ సందడి నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో దోర్నాల మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎస్సై నాగరాజు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులు, ఇతరుల కదలికలను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టారు.

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని పోలీసులు సూచించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur