Dornala: కేజీబీవీ విద్యార్థినుల వ్యవసాయ నర్సరీ సందర్శన

Dornala: దోర్నాల కేజీబీవీ విద్యార్థినుల నర్సరీ సందర్శన. వృత్తి విద్యా కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకున్న వైనం.

Srikanth Singam, Markapur
Published on: 25 Sept 2026 9:03 PM IST
Dornala
X

Dornala: కేజీబీవీ విద్యార్థినుల వ్యవసాయ నర్సరీ సందర్శన

దోర్నాల: దోర్నాల మండలం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వృత్తి విద్యా కార్యక్రమం లో భాగగా KGBV పాఠశాల విద్యార్థులు వ్యవసాయ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా నర్సరీలోని వివిధ రకాల మొక్కలను పరిశీలించి, వాటి పెంపకం విధానాలను తెలుసుకున్నారు.

విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై నర్సరీ నిర్వాహకులు వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు మొక్కలను సంరక్షించాలనే బాధ్యతా భావం కలిగిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur