Dornala: దోర్నాలలో ఉచిత కంప్యూటర్ విద్యా కేంద్రం ప్రారంభం

Dornala: దోర్నాలలో గ్రామీణ విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం సర్వ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు.

Srikanth Singam, Markapur
Published on: 28 Sept 2026 6:16 PM IST
Dornala
X

Dornala: దోర్నాలలో ఉచిత కంప్యూటర్ విద్యా కేంద్రం ప్రారంభం

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాలగ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్, డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ అందించేందుకు దోర్నాలలో సర్వ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సర్వ్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్లు లీనా గార్నేపూడి, శాంతి ఆశికా తెల్లూరి, డా. ఆనంద్ ఆశీష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వసంత కాలేజ్ గ్రూప్ చైర్మన్, కరస్పాండెంట్ రామన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రమణ రెడ్డి, దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. మహేశ్వరి, రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ ఖాసిం, యాకోబ్ ఊదర తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎటువంటి ఫీజు లేకుండా కంప్యూటర్ వినియోగం, డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ ద్వారా ఉన్నత విద్యకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకునే నైపుణ్యాలు పెంపొందనున్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు, వివిధ డిజిటల్ సేవలను సులభంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.

ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా దోర్నాల పరిసర ప్రాంతాల ప్రజలకు సాంకేతిక విద్యను చేరువ చేయడమే కేంద్రం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ యువతలో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur