Ardhaveedu: అర్ధవీడులో పట్టపగలే భారీ చోరీ: 18 తులాల బంగారం అపహరణ!
Ardhaveedu: అర్ధవీడు మండలం మాగుటూరులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. విశ్రాంత ఉద్యోగి ఆవులయ్య ఇంట్లో తాళాలు పగలగొట్టి 18 తులాల బంగారం, రూ.1.70 లక్షల నగదును దుండగులు అపహరించారు.
Ardhaveedu: అర్ధవీడులో పట్టపగలే భారీ చోరీ: 18 తులాల బంగారం అపహరణ!
అర్ధవీడు: మార్కాపురం జిల్లా, అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో పట్టపగిలే చోరీ జరిగింది. విశ్రాంత ఉద్యోగి ఆవులయ్య ఇంటిలో దొంగలు పడి చోరీ చేశారు. ఇంటిలో ఎవరు లేని సమయాన్ని చూసి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని రూ.18 తులాల బంగారం రూ.1.70 లక్షల నగదు దొంగలు అపహరించారు. పొలం నుంచి ఇంటికి వచ్చిన యజమాని ఇంటిలో చెల్లా చెదురుగా పడిఉన్న వస్తువులను చూసి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




